నిర్మల్: వార్డెన్ ఆత్మహత్యాయత్నం!
పరివర్తన అవాజ్ నిర్మల్: వార్డెన్ ఆత్మహత్యాయత్నం! లక్సెట్టిపేట మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్, ఈనెల 18న సాయంత్రం తన ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 2528కు పెంచేందుకు కృషి చేశాడు. బిల్లులు రాకపోవడంతో రూ. లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసినట్లు, దీనిపై మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి వివరాలు సేకరిస్తామని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.

