భార్యపై అనుమానం.. బ్రిడ్జ్ పైనుంచి తోసేసి హత్య చేసిన భర్త
పరివర్తన అవాజ్, భార్యపై అనుమానం.. బ్రిడ్జ్ పైనుంచి తోసేసి హత్య చేసిన భర్త తెలంగాణ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్‌పై ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ ఘటన జరిగింది. మందమర్రి ప్రాంతానికి చెందిన రజిత అనే మహిళను ఆమె భర్త కుమార్ స్వామి వంతెనపై నుంచి తోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రజిత మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన భర్త కోపంతో ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

