పండగ పూట విషాదం.
పరివర్తన అవాజ్20, పండగ పూట విషాదం..నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున వినాయక్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బోర్గాం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అరుణ్ కుమార్ బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

