Friday, September 11, 2026
Home Uncategorized జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషక మాసం ముగింపు కార్యక్రమం

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషక మాసం ముగింపు కార్యక్రమం

0
34

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషక మాసం ముగింపు కార్యక్రమం,

గురువారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ పోషక మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన పోషకమాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం రోజూ తినే ఆహారంలో చక్కెర, ఆయిల్ మరియు ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలని సూచించారు. అంగన్వాడిలలో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతంగా నిర్వహించాలని సూచించారు. వీటి ద్వారా కమ్యూనిటీలో అవగాహన తీసుకురాగలమని చెప్పారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలకు , బాలింతకు అంగన్వాడి కేంద్రం కేంద్రాలలో సరైన పోషక పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. జిల్లాలో లోప పోషణ స్థాయిని తగ్గించాలని ఈ కార్యక్రమంలో తెలిపారు.
జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం రెగ్యులర్ గా అందించి గర్భిణీస్త్రీలు, బాలింతలలో ఎనీమియా తగ్గించి అనీమియా రహిత భారత్ గా మార్చాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నపాసన నిర్వహించడం జరిగింది. అనంతరం ఆరోగ్యలక్ష్మిలో రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న గర్భిణీకి, నార్మల్ డెలివరీ అయి పూర్తి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులకు కలెక్టర్ చేతుల మీదగా బహుమతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల నృత్య ప్రదర్శన అలరించింది.
కార్యక్రమం చివరలో అంగన్వాడి టీచర్ల చేత నిర్వహించబడిన పోషకాహార ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వీక్షించారు మరియు ఈ పోషకాహారాలను జిల్లా కలెక్టర్ రుచి చూసారు. ఈ పోషకాహార ప్రదర్శనలో చిరుధాన్యాలతో చేసిన పోషకాలు ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ప్రోగ్రాం ఆఫీసర్ యమిమ, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సీడీపిఓ లు, అంగన్వాడీ సువర్వైజర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.