మా పాపను ఆదుకోండి అంటూ ఓ తల్లితండ్రుల వెడుకుంటున్నారు,దాతల కోసం ఎదురుచూపు
పటాన్ చెరు పరివర్తన అవాజ్ అక్టోబర్ 11,ఆడుతూ పడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ఆ బాలికను కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లితండ్రులు రెక్కల కష్టంతో బతుకుబండిని లాగిస్తున్నారు అయితే తమ కుమార్తె మంచానికే పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం గత రెండు సంవత్సరాలుగా తమకు ఉన్నదంతా కూతురు వైద్యానికే ఖర్చు పెట్టిన పలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీరం గూడాకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది అయితే తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో వైద్యుల్ని సంప్రదించగా రెండు కిడ్నీలు పాడైనట్లు వెల్లడించారు ప్రస్తుతం బాలిక చికిత్స చేయిస్తున్నారు ఇప్పటివరకు బాలిక చికిత్సకోసం తల్లితండ్రులు 16 లక్షలవరకు ఖర్చు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు కిడ్నీ మార్పిడి చేస్తేనే బాలిక కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి బాగులేకపోవడం తో ఎవరైనా దాతలు మానవతా దృక్పథంతో సహాయం చేసి తమ కుమార్తెను బతికించాలని వేడుకుంటున్నారు అయితే తమ కుమార్తె కిడ్నీ మార్పుకు 25 లక్షలవరకు ఖర్చవుతుందని కిడ్నీ మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నా ఆర్థిక స్థోమత లేక బాలిక తల్లిదండ్రులు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా సహాయం చేయాలనుకునేవారు
ఈ నంబర్ ని సంప్రదించగలరని ఫోన్ పే, కానీ గూగుల్ పే కానీ ఇదే నంబర్ కు ఉన్నాయి… :9494242655…. దయచేసి సహాయం చేసి తమ కుమార్తే ప్రాణాలు కాపాడగలరని వేడుకుంటున్నా తల్లితండ్రులు

