ఫుట్ పాత్ వ్యాపారాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు
శేరిలింగంపల్లి పరివర్తనఅవాజ్ అక్టోబర్ 11 ,ఫుట్ పాత్ ఎంకోరోజ్మెంట్ మరియు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతున్నా కారణంగా శనివారం నాడు మియాపూర్ డివిజన్ లోని జేపీ నగర్ నుండి హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ రోడ్డులో ఫుట్ పాత్ లపై ఇరువైపులా ఉన్న వ్యాపార దూఖానాలను మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ప్రతిరోజూ ఫుట్ పాత్ లపై వెలిసిన దూఖానాలవల్ల వాటిముంది పార్కింగ్ చేసిన వాహనాలవల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అంతేకాకుండా ఇకపై రోడ్డుకు ఇరువైపులా ఎవరుకూడా వ్యాపారాలు నిర్వహించరాదని సూచించారు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
