అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకునికి ఆర్థిక సాయం అందించిన మైనంపల్లి హనుమంతరావు
(పరివర్తన అవాజ్ న్యూస్)అక్టోబర్10 , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సిద్ధ రాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేత..మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ రెండో వార్డు, కోమటిపల్లి గ్రామానికి చెందిన సిద్ధ రాములు గారి పరిస్థితిని తెలుసుకున్న నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు, తెలుపగా తక్షణం స్పందించిన మైనంపల్లి ఆదేశాల మేరకు పీసీసీ సెక్రటరీ చౌదరి సుప్రభాత్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి,దేమే యాదగిరి, సరాఫ్ యాదగిరి, అల్లాడి వెంకటేష్,ఎనిశెట్టి అశోక్ గుప్తా, సుందర్ సింగ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత ఆధ్వర్యంలో గజవాడ నాగరాజు తన సొంత డబ్బు 50వేల రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు కోమటి పల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి సిద్ధ రాములు గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయనకు భార్య సాయమ్మ, ముగ్గురు కుమార్తెలు వసంతి, అఖిల, ఐశ్వర్య లు ఉన్నారని వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతుండడం బాధాకరమని అన్నారు..ఈ విషయం తెలుసుకున్న ఆరో వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి కూడా బాధిత కుటుంబానికి ఒక క్వింటల్ బియ్యం మరియు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు
