రాయదుర్గంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన
శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 09 శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి లోని రాయదుర్గం గ్రామంలో గురువారం నాడు గ్రామస్థులు కొత్తగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వస్తశ్రీ విశ్వనామ సంవత్సరం దక్షిణాయనం,శరదృతువు,అశ్వ యుజ బహుళ పంచమి,రోహిణి నక్షత్రయుక్త వృచ్చికలగ్నంలో ఉదయం 9,05 నిమిషాలకు కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా గ్రామ వాస్తవ్యులు గణేష్ మాట్లాడుతూ రాయదుర్గం కట్టమైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ రోజు నుండి 11వ తారీఖు వరకు వేద పండితుల నడుమ నిత్యం పూజలు కొనసాగుతాయని అన్నారు అదేవిధంగా గుడి గురించి చెప్పాలంటే రాయదుర్గం లోని రహదారిలో ఉన్నటువంటి 400 ఏళ్ల చరిత్ర కలిగిన చిన్నగుడి వర్షాల సమయంలో నీళ్లల్లో పూర్తిగా మునిగిపోతూ ఉండటం అదేవిధంగా గుడి ప్రాంగణం లోనుండి వచ్చిపోయే వాహానాలా వల్ల నిత్యం భక్తులు ప్రజలు ఇబ్బందులకు గురిఅవుతున్న కారణంగా ఇక్కడ ఉన్న ఈ చిన్నగుడిని పెద్ద ఆలయం గా మార్చలన్నా సంకల్పంతో ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చినదని
గుడి నిర్మాణ స్థలం కోసం ప్రభుత్వ కార్యాలయాలల్లో అప్పీల్ చేసుకోగా ప్రభుత్వం ఆర ఎకరం భూమి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందని ఆ యొక్క భూమిలో రాయదుర్గం గ్రామస్తులు ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి గుట్టలుగా ఉన్న స్థలాన్ని ఈ రోజు గుడిగా ఏర్పాటు చేసుకోవడానికి శాయశక్తులు ఒడ్డి గుడిని కట్టుకోవడం జరిగిందని అన్నారు గుడి నిర్మాణాన్ని ఆపడానికి ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడిన కూడా అమ్మ వారి కృప కటాక్షములతో బహు బహు చక్కనైన ఆలయాన్ని ఈ రోజు రాయదుర్గం గ్రమస్తులందరం అందరం కలసి నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చెయ్యటం జరిగిందని అన్నారు ముఖ్యంగా గ్రామస్తులందరినీ ముందుకు నడిపించిన చంద్ర శేఖర్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన గ్రామస్తులు

