జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మెదక్ ఎంపీడీఓ కార్యాలయం మరియు హవేలీఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ –
జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి ఎన్నికల నామినేషన్ల దాఖల సందర్భంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్
ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.
అభ్యర్థులు నామినేషన్ దాఖలు సందర్భంగా ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే, ముందుగా పోలీస్ శాఖ అధికారుల నుండి అనుమతి పొందాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత ప్రాంత పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు.
అదనపు ఎస్పీ
అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సమగ్ర సూచనలు చేశారు
అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలి.
ఊరేగింపు కార్యక్రమాలు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలి.
కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఎవరూ మాట్లాడరాదు.
వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలి అని అన్నారు
వాహనాలపై రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ఒరిజినల్ కాపీతో పాటు వాహనం నంబర్, అభ్యర్థి పేరు స్పష్టంగా విండ్స్‌క్రీన్‌పై ప్రదర్శించాలి. అని అన్నారు
నామినేషన్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
నామినేషన్ సమర్పించడానికి ఊరేగింపుతో వచ్చే అభ్యర్థి తన అనుచరులు, మద్దతుదారులు మొదలైన వారు రిటర్నింగ్ అధికారి కార్యాలయనికి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతించబడును.
రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశం ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి మరియు మరో ఇద్దరికి మాత్రమే అనుమతించబడుతుంది.
