Friday, September 11, 2026
Home Uncategorized బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులను ఖండించిన రవి యాదవ్

బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులను ఖండించిన రవి యాదవ్

0
17

📰 Generate e-Paper Clip

ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన,,,?

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చార్జీలు తగ్గించీ
ప్రజలపై భారాన్ని తగ్గించాలి

శేరిలింగంపల్లి పరివర్తన ఆవాజ్ న్యూస్ అక్టోబర్ 09

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆర్టీసీ బస్ భవన్ కు నిరసన తెలపడానికి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను.విద్యార్థి నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చెయ్యటం కరెక్ట్ కాదని దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని పోలీసుల తీరును ఖండించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపే బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కే లేకుండా పోయిందని మండిపడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తంచేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.