ప్రదీప్ మాతృమూర్తి మృతికి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సంతాపం
ఎల్లారెడ్డి పరివర్తన అవాజ్: నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ ప్రదీప్ మాతృమూర్తి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాంతో కలిసి ఆదివారం ప్రదీప్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిక్కనూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పరంధాములు, అఫిజ్ పటేల్, బాలకిషన్, నీల రవి తదితరులు పాల్గొన్నారు.