బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత.. బాల గ్రామసభలో సర్పంచ్ బోడ బాలు నాయక్

పరివర్తన అవాజ్ టేకులపల్లి, నవంబర్ 14 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల గ్రామసభ కార్యక్రమాన్ని శనివారం టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి శోభన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల భద్రతతో పాటు గ్రామ అభివృద్ధిలో పిల్లల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే బాల గ్రామసభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను నిర్భయంగా సభ...