Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 3:33 pm Posted by : parivarthanaawaaz

బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత.. బాల గ్రామసభలో సర్పంచ్ బోడ బాలు నాయక్

పరివర్తన అవాజ్ టేకులపల్లి, నవంబర్ 14 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల గ్రామసభ కార్యక్రమాన్ని శనివారం టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి శోభన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల భద్రతతో పాటు గ్రామ అభివృద్ధిలో పిల్లల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే బాల గ్రామసభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను నిర్భయంగా సభ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నా