పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 13 మంది అరెస్ట్

కామారెడ్డి జిల్లాపరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలో జూదం కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం రాత్రి సదాశివనగర్ పోలీసులు మండలంలోని వివిధ గ్రామాల శివారుల్లో దాడులు నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు భూంపల్లి , పద్మాజీవాడి, మల్లుపేట్ గ్రామాల శివారుల్లో నిర్వహించిన దాడుల్లో జూదం ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ, జూదానికి బానిసై జీవితాలను...