Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 12:20 pm Posted by : parivarthanaawaaz

భూంపల్లి లో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

కామారెడ్డి జిల్లా పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిత్రపటానికి స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సూపరిపాలనలో దూసుకుపోతుందని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని తెలిపారు గ్రామపంచాయతీ భవనాలకు మహిళా భవనాలకు. హాస్పిటల్ భవనాలకు పాఠశాల భవనాలకు కేంద్ర ప్రభుత్వం 6. 69 కోట్ల నిధులు విడుదల చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పసుల సాయిలు బిజెపి బూత్ అధ్యక్షులు గడిల కిషన్ రావు. వడ్ల రాజేందర్ వడ్ల నర్సింలు. శక్తి కేంద్రం ఇంచార్జ్ తిపిరిశెట్టి భాస్కర్. పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు