రోస్టర్ పాయింట్ల సవరణ కోసం మాల సంఘాల నిరాహార దీక్ష

కామారెడ్డి జిల్లా  పరివర్తన ఆవాజ్ : మాల మహానాడు సంఘం, మాల సంఘం, అంబేద్కర్ సంఘం ఎంసిఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మహనీయుల విగ్రహాల ముందు రోస్టర్ పాయింట్ల సవరణ సాధనకై ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యల సంతోష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల...