Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 7:51 am Posted by : parivarthanaawaaz

హార్వెస్టర్ లీజు పేరుతో కిడ్నాప్.. రూ.10 లక్షలు డిమాండ్.. నలుగురు నిందితుల అరెస్ట్

కామారెడ్డి పరివర్తన అవాజ్: హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి కోనాపూర్‌కు చెందిన మహేష్‌ను కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు నిందితులను దోమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని కారులో అపహరించి దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ దోచుకోగా, పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. వారి నుంచి ఎర్టిగా కారు, ఐదు సెల్‌ఫోన్లు, ఉన్ని టోపీ, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు కేసును ఛేదించడంలో చురుకుగా పనిచేసిన భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నరేష్, దోమకొండ ఎస్‌ఐ శ్రీ ప్రభాకర్ మరియు కానిస్టేబుల్ సాయిబాబా , బాలకృష్ణ, బైరవప్రసాద్, హోం గార్డ్ శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ  అభినందించారు.