Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 4:22 pm Posted by : parivarthanaawaaz

శబరిమల భక్తుల కోసం కామారెడ్డి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కామారెడ్డి జిల్లా  పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లా ప్రజలకు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ శుభవార్త చెప్పారు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు మరియు శబరిమల వెళ్ళు భక్తులకు టీజీఎస్ఆర్టిసి కామారెడ్డి బస్సు డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు కల్పించబడినది అని తెలుపుటకు సంతోషిస్తున్నాము అని పి.దినేష్ కుమార్ డిపో మేనేజర్ కామారెడ్డి తెలిపినారుశబరిమల వెళ్ళుటకు గురుస్వామి బస్సు బుక్కు చేసుకున్నచో వారికి ప్రయాణం చార్జీలు మినహాయింపు కలదు మరియు బస్సు సీటింగ్ కెపాసిటీ తో పాటుగా ఇద్దరు వంట మనుషులు ఇద్దరు మణికంఠ స్వామి లను అనుమతించబడునుశబరిమల వెళ్ళు బస్సులకు టోల్గేట్ రుసుము మరియు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు బార్డర్ టాక్స్లు భక్తులు చెల్లించవలసిన అవసరం లేదుటి జి ఎస్ ఆర్ టి సి బస్సులకు కేరళ రాష్ట్రంలో బోర్డర్ టాక్స్ లు మినాయింపు కలదు బస్సుల పార్కింగ్ చార్జీలు భక్తులు చెల్లించవలసి ఉంటుంది శబరిమల వెళ్ళు ఆర్టీసీ బస్సులలో అనుభవిజ్ఞులైన మరియు రూటు తెలిసినా మంచి నైపుణ్యం ఉన్న డ్రైవర్లను ప్రతి బస్సుకు ఇద్దరి చొప్పున ఇవ్వడం జరుగుతుందిఅలాగే కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల కోసం ప్రముఖ పుణ్య శైవ క్షేత్రాలు అయినా శ్రీశైలం కాణిపాకం స్వర్ణ దేవాలయం జోగులాంబ కంచి కామాక్షి మరియు అరుణాచలం క్షేత్రాలను దర్శించుకొనుటకు కామారెడ్డి డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సులను అదే ప్రతిపాదికంగా ఇవ్వబడును అని కామారెడ్డి పి దినేష్ కుమార్ బస్ డిపో మేనేజర్ కామారెడ్డి ఒక ప్రకటనలో తెలిపినారు