గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత.. ప్రిన్సిపల్‌పై చర్యలకు డిమాండ్

కూరలో కప్ప పడిన ఘటనపై కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ దోమకొండ పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు అందించిన కూరలో కప్ప పడిన ఘటనపై తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శి దుబ్బాక శంకర్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో కూరలో కప్ప పడటంతో పలువురు విద్యార్థులకు...