Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 2:09 pm Posted by : parivarthanaawaaz

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత.. ప్రిన్సిపల్‌పై చర్యలకు డిమాండ్

కూరలో కప్ప పడిన ఘటనపై కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గురుకుల పేరెంట్స్ అసోసియేషన్

దోమకొండ పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు అందించిన కూరలో కప్ప పడిన ఘటనపై తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శి దుబ్బాక శంకర్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో కూరలో కప్ప పడటంతో పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయని తెలిపారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ చైతన్య, వైస్ ప్రిన్సిపల్ మీనాక్షిని ప్రశ్నించగా ఘటన వాస్తవమేనని అంగీకరించినట్లు పేర్కొన్నారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, వారిని దోమకొండ గురుకుల పాఠశాల నుంచి ఇతర పాఠశాలలకు బదిలీ చేయాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అడ్వైజర్ లింగం, కమిటీ సభ్యులు లలిత, చంద్రశేఖర్, కర్ణ శ్రీకాంత్, సుధా తదితరులు పాల్గొన్నారు.