కృష్ణాజివాడిలో జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహణ
దేవుడు అందరివాడు దేవాలయం అందరిది తుమ్మ రామచంద్రం తాడ్వాయి పరివర్తన అవాజ్ :కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని కులాల ప్రజలు కలిసికట్టుగా దేవాలయంలోకి ప్రవేశించి శివునికి అభిషేకం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తుమ్మ రామచంద్రం మాట్లాడుతూ 1936 నవంబర్ 12న అప్పటి ట్రావెన్కోర్ సంస్థాన మహారాజు శ్రీ చితిర తిరునాళ్ బలరామ వర్మ దేవాలయ ప్రవేశ...