Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 1:45 pm Posted by : parivarthanaawaaz

**కామారెడ్డిలో బీజేపీ మైనార్టీ మోర్చా కార్యవర్గ సమావేశం**

కామారెడ్డి పరివర్తన అవాజ్ : భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాగ్ మోహన్ సింగ్ కామారెడ్డి జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాగ్ మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ ఏర్పడుతుందని ప్రజలు గత బిఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని ఇప్పటినుండి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా యువ నాయకులు కష్టపడి పనిచేసి రాబోయే కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రాజ్ నీస్, హరి ప్రతాప్ సింగ్, మైనార్టీ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వసీం అక్రమ్, మాజీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ జిల్లా జనరల్ సెక్రెటరీ రాజాసింగ్, ఉపాధ్యక్షులు నహీముద్దీన్ యూసుఫ్ హుస్సేన్ పాల్గొన్నారు.