కామారెడ్డి పరివర్తన అవాజ్ : మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలుగా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆకుల కల్పన నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గాంధీభవన్ లో నియామక పత్రాన్ని సోమవారం అందచేశారు. పార్టీ శ్రేయస్సుకు కృషి చేయాలని సూచించారు. తన పై ఎంతో నమ్మకం ఉంచి కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ఆకుల కల్పన ధన్యవాదములు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో మహిళా కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. సభ్యత్వం నమోదుతో పాటు పార్టీ కార్యక్రమా లను ప్రజల్లోనికి తీసుకెళ్తానన్నారు. తనను కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
గాంధీ భవన్ లో ఆకుల కల్పనకు రాష్ట్ర అధ్యక్షారాలిచే నియామక పత్రం అందచేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, ఎల్లారెడ్డి నియోజక వర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అరుణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గాంధారి మాజీ ఎంపిపి ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.