హన్మకొండ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 7
దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దీపావళి దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందం, ఆప్యాయత, సిరిసంపదలను నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో నూతన ఆశలు, సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ మరింత ప్రగతిపథంలో పయనించాలని ఆకాంక్షించారు.పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, కాలుష్యాన్ని తగ్గించేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు బాణసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు అప్రమత్తంగా ఉండి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.వెలుగుల పండుగ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, సానుకూలతను నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.