–-ధర్మసాగర్ దేవాదుల డి-9 కెనాల్ ద్వారా నీటి సరఫరాపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన…
వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 7
ఐనవోలు మండలం గరిమలపల్లి గ్రామంలో ధర్మసాగర్ దేవాదుల డి-9 కెనాల్ ద్వారా వస్తున్న నీటి సరఫరా పరిస్థితిని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు * రైతులతో, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కెనాల్ ద్వారా గ్రామానికి చేరుతున్న నీటి ప్రవాహం, నీటి సరఫరా పరిస్థితి, రైతులకు సాగునీరు అందుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న రైతులకు సాగునీరు ఎంతో కీలకమని, సరైన సమయంలో నీరు అందితేనే పంటలు సమృద్ధిగా పండించి రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కెనాల్ ద్వారా వచ్చే నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా నీటి సరఫరాను పర్యవేక్షించాలని, చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రైతుల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో కక్కిరాలపల్లి సర్పంచ్ వాణి, ఉడతగూడెం సర్పంచ్ దేవిక రెడ్డి, రాంనగర్ సర్పంచ్ ఆకులపల్లి స్వాతి, లింగమరిగుడం సర్పంచ్ యాకయ్య, నందనం సర్పంచ్ జట్టబోయిన రాజు, గరిమలపల్లి సర్పంచ్ అశోక్ , జెబిఎం చైర్మెన్ జన్నపురెడ్డి రుగ్విద్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి, సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి, రమేష్,డిసిసి సెక్రెటరీ రాయారపు సాంబయ్య, ఎలీషా, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.