అనకాపల్లి పరివర్తన అవాజ్ : అనకాపల్లి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలోని 8 మండలాలతో పాటు అనకాపల్లి మండలంలోని పాపయ్యపాలెం, పి.ఎస్.పాలెం గ్రామాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు. మూడో విడతలో 214 గ్రామ పంచాయతీలు, 2,046 వార్డులు, 393 పోలింగ్ లొకేషన్లు, 2,046 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 96 అత్యంత సమస్యాత్మక, 82 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను కఠినంగా అమలు చేయాలని, గుంపులుగా గుమికూడడం, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు