వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 14
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమములో నిర్వహించారు ఈ కార్యక్రమం లో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ కల్మషం ఎరుగని మానసిక దివ్యాంగుల మద్య బాలల దినోత్సవం లో పాల్గొనడం సంతోషముగా ఉందని అన్నారు, బాలల హక్కులను కాపాడటం అందరి భాధ్యత అని మానసిక దివ్యాంగుల పిల్లలకు అందరి పిల్లలకు ఉన్న హక్కులు వర్తిస్తాయని అన్నారు దేశ భవిష్యత్తు అయిన చిన్నారులకు అందమైన బాల్యాన్ని బహుమతి గా అందించాలని అన్నారు అదే నిజమైన బాలల దినోత్సవం అన్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని కేటాయించాలని పిల్లలు స్వేచ్ఛగా తమ భావాలను చెప్పుకునేలా పిల్లలు పెరగాలన్నారు , అనంతరం పిల్లలు డాన్సులు, పాటలతో అలరించారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, సుచరిత , రాజేందర్ రెడ్డి, వసుధ ,హరిత భార్గవి పాల్గొన్నారు.