Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 4:18 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

నీటిని పొదుపు చేయడం మన బాద్యత,,నీటిని వృధా మరియు దుర్వినియోగం చేయమని పిల్లలచే ప్రతిజ్ఞ చేయించిన- అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి..

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ నవంబర్ 13

కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో బాల సముద్రం లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఆనంద నిలయం హాస్టల్ నందు ” నీటి పొదుపు పై అవగాహన కార్య క్రమం నిర్వహించారు” ఈ సందర్భం గా డాక్టర్ అనితా రెడ్డి మాట్లా డుతూ… ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, నిర్వహణ, నీటిి పొదుపు పై అవగాహన కలిగి ఉండటం అవసరం అని అప్పుడే అందరి అవసరాలకు మరియు తాగు నీరు అందుతుందని అన్నారు వర్షాలు లేక భూగర్భ జలాలు తక్కువై నీటి కొరత ఎంతో ఉందని ప్రజలు దీనిపై అవగాహన కలిగి నీటిని పొదుపు చేయాలని అన్నారు, హాస్టల్లో పిల్లలు ఎంతో మంది ఉండడం తో నీరు వృదా అవుతుందని అందుకే పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని, కాలనీ వాసులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు, అవసరమైన మేరనే నీటిని వినియోగించుకోవాలని, నీటిని పొదుపు గా వాడాలని, ఇండ్లలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని, విరివిగా మోక్కలు నాటాలని అన్నారు, పిల్లలచే హాస్టల్స్ లో నీటిని వృదా చేయమని, ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుంటామని డాక్టర్ అనితా రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు,,నీటి అధిక వినియోగం చేయకుండా బాధ్యతగా వినియోగించు కోవాలని నీటిని నిర్లక్ష్యంగా వాడటం వలన భవిష్యత్తు తరాలకు నీరు అందుబాటు లో ఉండకపోవచ్చు.వినియోగదారులు గా మన బాధ్యత ఏమిటంటే, అనవసరమైన నీటి వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించే పనులు మనం చేయకపోవడం వలన సంవృద్దిగా వర్షాలు పడి నీటి కొరత తగ్గుతుందని, దాని కోసం మనం బాద్యత గా సంఘటితం గా పని చేయాలని డాక్టర్ అనితా రెడ్డి అందరికి పిలుపునిచ్చారు,కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, పిల్లలు, సరిత, రాఘవ పాల్గొన్నారు.