పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 19 హన్మకొండ జిల్లా
బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ ఆటోనగర్ లోని జువెనల్ హోమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు , ఫార్మర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా హజరై, జీవితపు విలువలు బాలల హక్కుల పరిరక్షణ, బాద్యతల పై అవగాహన కల్పించారు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ తెలిసీతెలియని తనంతో ఎవో తప్పులు చేసి జువెనల్ హోమ్ కి చేరిన పిల్లల పట్ల మరింత శ్రద్ధగా ప్రేమ తో వ్యవహరించి వారి నడవడికలో మార్పు తీసుకొని వచ్చి వారికి మళ్లీ మంచి భవిష్యత్తు అందమైన బాల్యాన్ని అందించే బాద్యత అందరిదని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు అలాగే బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి పిల్లలకు రక్షణ, భద్రత, ప్రతి బిడ్డకు విద్య అందించడమే మన లక్ష్యం అని ప్రతి ఒక్కరూ చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయం తో కలిసి పని చేద్దాం క్రైం రేట్ తగ్గిద్దాం అన్నారు, పిల్లలకు వారి హక్కులతో పాటు బాద్యతలు తెలియచేయాలని అన్నారు బాలలే దేశ సంపద, భవిష్యత్తు పౌరులని పేర్కొన్నారు ప్రతి పిల్లలలో దేశభక్తి, పెద్దలను గౌరవించేలా,జీవితం విలువలు తెలిసేలా జువెనల్ హోమ్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి వ్యక్తిత్వం ,నడవడికలో మార్పు తీసుకుని రావాలని సిబ్బందికి తెలిపారు,తన సహాయసహకారాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు, పిల్లలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం కొంత మంది బాలలు మాదకద్రవ్యా లకు అలవాటు పడటం ఆందోళనకరమైన విషయమని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని తెలిపారు, ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుకు ఎంతో కర్చు చేస్తుందని పిల్లలు తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని, విద్య ద్వారా ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించి జీవితంలో ఎదగాలని పిలుపు నిచ్చారు, అనంతరం జువెనల్ హోమ్ పిల్లలందరికీ డాక్టర్ అనితా రెడ్డి రగ్గులను ఉచితంగా అందించారు ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి ,జువెనల్ హోమ్ సూపరింటెండెంట్ శ్రీదేవి, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.