పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 22
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ వడ్డెర బస్తీ బాలసముద్రం పోలియో కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడు.తూ…. పసి పిల్లల జీవితాలు అంగవైకల్యం భారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వo పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టారని ప్రజలు వినియోగించుకోవాలన్నారునవంబర్ 22వ తేదీన ఆదివారం పుట్టిననాటి నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని,తల్లితండ్రులు సమీప పోలియో కేంద్రానికి చిన్నారులను తీసుకువచ్చి, పోలియో చుక్కలు వేయించాలని, పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవి ప్రతి చిన్నారికి వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు0-5 ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు పోలియో చుక్కలు ఆరోగ్యకరమైన భవిష్యత్తునందిస్తుందని, సమిష్టి కృషితో పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించి చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, ఆశవర్కల్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.