చల్లసముద్రం గ్రామపంచాయతీలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య కి వినతి
ఇల్లందు (చల్లసముద్రం):చల్లసముద్రం గ్రామపంచాయతీ ప్రజల సామాజిక, సాంస్కృతిక మరియు శుభకార్యాల అవసరాల నిమిత్తం గ్రామంలో నూతన కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గారిని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు మరియు పేద ప్రజల శుభకార్యాలు జరుపుకోవడానికి సరైన వసతి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కమ్యూనిటీ హాల్ మంజూరు...