ఇల్లందు (చల్లసముద్రం):చల్లసముద్రం గ్రామపంచాయతీ ప్రజల సామాజిక, సాంస్కృతిక మరియు శుభకార్యాల అవసరాల నిమిత్తం గ్రామంలో నూతన కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గారిని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు మరియు పేద ప్రజల శుభకార్యాలు జరుపుకోవడానికి సరైన వసతి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు, వీలైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చల్లసముద్రం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతు వెంకటేశ్వర్లు గారు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం గారు, వార్డు మెంబర్ నరాటి కోటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి కోరిపెళ్లి యశ్వంత్ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పబ్బు శివ గారు తదితరులు పాల్గొన్నారు.