గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఉర్దూ జర్నలిస్టులకు సమాన ప్రాతినిధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలి…
--బైలాస్ సవరణ కమిటీకి టీయూడబ్ల్యూజేయూ వరంగల్ యూనిట్ వినతి.. ప్రత్యేక బాక్స్లోనూ ప్రతిపాదనలు సమర్పణ... పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, నవంబర్ 20 గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఉర్దూ జర్నలిస్టులకు సమాన ప్రాతినిధ్యం, సభ్యత్వ హక్కులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజేయూ) వరంగల్ యూనిట్ ప్రెస్ క్లబ్ బైలాస్ సవరణ కమిటీకి సమగ్రంగా లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించింది.ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణను క్రమబద్ధీకరించడంతో పాటు నూతన బైలాస్ రూపకల్పనలో భాగంగా కమిటీ...