Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 3:22 am Posted by : KUNDHURU ANAND

ఏటికొప్పాక సర్పంచ్ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు.. 29న తేలనున్న ప్రజాతీర్పు!

అనకాపల్లి జిల్లా పరివర్తన అవాజ్ :ఎలమంచిలి మండలం ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతుండటంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ నెల 29న జరగనున్న ఎన్నికల్లో అన్నం వెంకటరావు, యన్నాంశెట్టి సన్యాసిరావు, అన్నం నాగేంద్రరావు, కర్రీ సింహాచలం, అన్నం వాణి, గొంతు మూర్తి రవితేజ బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో గ్రామంలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తుండగా, సర్పంచ్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై గ్రామ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 29న జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఇచ్చే తీర్పు ఏటికొప్పాక రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.ఆరుగురు అభ్యర్థులు.. ఒకే సర్పంచ్ పీఠం.. ఏటికొప్పాకలో ప్రజాతీర్పు కోసం ఎదురుచూపులు!