ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్ల నిర్మాణ పనులను నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహకారం...