జనగణనలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ చేర్చాలి: దండి వెంకట్
( పరివర్తన అవాజ్ ) నిజామాబాద్ జిల్లా అక్టోబర్ 23: కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2027 జనగణనలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ చేర్చాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కచ్చితమైన గణాంకాలు సేకరించినప్పుడే విద్య, ఉద్యోగాలు,...