వరంగల్, అక్టోబర్ 7 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక…వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్. చూంగ్తు, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీఆర్ఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ డా. గౌరవ్ ఉప్పల్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన వారు ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులపై సమీక్షించారు. ఆసుపత్రిలో వైద్య విభాగాలు, రోగులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వైద్యులు, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడరాదని, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.నిర్మాణ పనుల ప్రతి దశను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.వరంగల్, హనుమకొండ జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ ప్రాంత ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.భవన నిర్మాణం, వివిధ విభాగాల ఏర్పాటు, మౌలిక వసతులు, వైద్య సేవలకు అవసరమైన సౌకర్యాలు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు.ఈ పరిశీలనలో డీఎంఈ డా. వాణి, డా విమల థామస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రాంకుమార్, ఆర్ఎంఓ డా. అశ్విన్‌తో పాటు ఆరోగ్య, వైద్య, ఇంజినీరింగ్ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.