పరివర్తన అవాజ్ :కామారెడ్డి జిల్లాలోని టి జె ఏ సభ్యుడు రిపోర్టర్ అయినట్టి తాటి మెడికల్ రాజు గారి అన్నయ్య కంచరి తాటి శ్రీనివాస్ గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం మరణించినందున ఈ రోజు టి జె ఏ కామారెడ్డి జిల్లా కమిటీ రామారెడ్డి లోని వారి ఇంటికి వెళ్లి వారిని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎన్ యు జె (ఐ) జాతీయ ఉపాధ్యక్షులు ఉక్కల్కర్ రాజేంద్రనాథ్, టి జె ఏ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సడక్ సునీల్, టి జె ఏ కామారెడ్డి జిల్లా కార్యదర్శి శ్రీధర్ సి హెచ్, టి జె ఏ సభ్యులు ఎల్లన్న, నవీన్, భైరు, రామ్మూర్తి తో పాటు తదితరులు పాల్గొన్నారు.