Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 11:53 am Posted by : parivarthanaawaaz

అబ్నుస్ ఫంక్షన్‌హాల్‌లో ‘సీరత్ మోహ్సిన్ ఇన్సానియాత్’ సభ

పరివర్తన ఆవాజ్ తెలంగాణ,వరంగల్,సెప్టెంబర్ 6 : వరంగల్ జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో ‘సీరత్ మోహ్సిన్ ఇన్సానియాత్ సల్లల్లాహు అలైహి వసల్లం’ పేరుతో సోమవారం మగ్రిబ్ నమాజ్ అనంతరం ఏడు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జమియత్ ఉలేమా ప్రతినిధులు తెలిపారు.ఈ మేరకు ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సభ వివరాలను వెల్లడించారు.సెప్టెంబర్ 7న మగ్రిబ్ నమాజ్ అనంతరం ఎల్‌బీ నగర్‌లోని అబ్నుస్ ఫంక్షన్‌హాల్‌లో సభ జరగనుంది.వరంగల్ జిల్లా జమియత్ ఉలేమా ఎ హింద్,ఉస్తాద్ ఉలేమా,పాస్‌బానే ఖౌమ్ వ మిల్లత్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూసుఫ్ జాహిద్ సాహెబ్ మజాహెరీ అధ్యక్షతన మరియు జమ్మియతే ఉలేమా ఎ హింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.సభకు ముఖ్య అతిథిగా జమియత్ ఉలేమా-ఎ-హింద్ కేంద్ర ప్రధాన కార్యదర్శి హజ్రత్ మౌలానా ముఫ్తీ ముహమ్మద్ మాసూమ్ సాహెబ్ ఖాస్మీ హాజరై ప్రసంగించనున్నారు.ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం)జీవిత విధానం,ఆయన బోధనలు,మానవతా విలువలు,ఆయన చూపిన మార్గంలో మన జీవితాలను ఎలా కొనసాగించాలనే అంశాలపై సభలో వివరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించే ప్రతి ఒక్కరూ సభకు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జమియత్ ఉలేమా-ఎ-వరంగల్ జిల్లా అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అయూబ్ సాహెబ్ ఖాస్మీ,జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా మునవ్వర్ హుస్సేన్ సాహెబ్ ఖాస్మీ కోరారు.సభకు హాజరయ్యే వారికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు.సభకు కన్వీనర్‌గా జమియత్ ఉలేమా-ఎ-వరంగల్ నగర కార్యదర్శి హాఫిజ్,ఖారీ అబ్దుల్ ముఖీత్ సాహెబ్ రహ్మానీ వ్యవహరించనున్నారు.ప్రెస్‌మీట్‌లో జమియత్ ఉలేమా వరంగల్ నగర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అయూబ్ సాహెబ్ ఖాస్మి ,మౌలానా మొహ్సిన్ సాహెబ్ ఖాస్మి నక్షద్బంధి మౌలానా నౌషాద్ అక్తర్ సాహెబ్,మౌలానా వాజిద్ సాహెబ్ హుస్సానీ,షేక్ జాకీర్ సాహెబ్,సయ్యద్ ఒసామా సాహెబ్,హాఫిజ్ అబ్దుల్ సలామ్ సాహెబ్,హాఫిజ్ అబ్దుల్ కలాం సాహెబ్,హాఫిజ్ అకీల్ సాహెబ్,హాఫిజ్ అమీర్,మహమ్మద్ యాకూబ్ తదితర ముఖ్య ఉలేమాలు పాల్గొన్నారు.