Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 9:19 am Posted by : parivarthanaawaaz

గ్రామసభ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన

పరివర్తన ఆవాజ్. సెప్టెంబర్ 2 గార్ల : స్థానికమేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలకు అంతరాయం లేకుండా తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామసభ ఎదుట వినూత్న నిరసన చేపట్టారు.మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గ్రామసభ సమావేశం ఎదుట సిపిఎం, న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాల నాయకులు, హమాలీలు, మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే అన్ని వార్డులకు సమానంగా తాగునీరు అందించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.