తెలంగాణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

పరివర్తన ఆవాజ్ : శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై అవతరించిన పవిత్రమైన రోజును జన్మాష్టమి లేదా కృష్ణాష్టమిగా జరుపుకుంటామని,ఇది హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఈ పర్వదినం సందర్భంగా భక్తజనులు శ్రీకృష్ణుడికి పూజలు జరిపి భగవద్గీత, శ్రీమద్భాగవతం పారాయణం చేస్తారని, కొన్ని చోట్ల ఉట్లు కొట్టడం వంటి ఆచారాలు ఉన్నాయన్నారు.చిన్నపిల్లలను కృష్ణుడి,గోపికల వేషాధారణలో అలంకరించి పెద్దలు సంబురపడతారని,...