పరివర్తన ఆవాజ్ : శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై అవతరించిన పవిత్రమైన రోజును జన్మాష్టమి లేదా కృష్ణాష్టమిగా జరుపుకుంటామని,ఇది హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఈ పర్వదినం సందర్భంగా భక్తజనులు శ్రీకృష్ణుడికి పూజలు జరిపి భగవద్గీత, శ్రీమద్భాగవతం పారాయణం చేస్తారని, కొన్ని చోట్ల ఉట్లు కొట్టడం వంటి ఆచారాలు ఉన్నాయన్నారు.చిన్నపిల్లలను కృష్ణుడి,గోపికల వేషాధారణలో అలంకరించి పెద్దలు సంబురపడతారని, పాఠశాలల్లో కూడా ఈ పండుగను జరుపుతారని ఎంపీ రవిచంద్ర వివరించారు.జన్మాష్టమి మనకు ధర్మం,భక్తి, ప్రేమ,సత్యం,కర్తవ్యనిష్ఠ వంటి విలువలను గుర్తు చేస్తున్నదని ఆయన చెప్పారు.ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ఆకాంక్షిస్తూ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.