Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:01 am Posted by : parivarthanaawaaz

విశ్వకర్మ ఏక్తా యాత్ర 5వ రోజు

      బస్వాపూర్–బిక్కనూరు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశాలు

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, సెప్టెంబర్ 21, 2026: విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి నేతృత్వంలో హైదరాబాద్ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న 1,700 కిలోమీటర్ల, 74 రోజుల విశ్వకర్మ ఏక్తా యాత్ర 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా, బస్వాపూర్, బిక్కనూరు కామారెడ్డి జిల్లా ప్రాంతాల్లో విశ్వకర్మ సోదరులతో సమావేశాలు నిర్వహించారు. కామారెడ్డి లో జరిగిన కార్యక్రమానికి విశ్వకర్మ రాష్ట్ర నాయకులు బ్రహ్మశ్రీ తిప్పర్తి సతీష్ విశ్వకర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ, విశ్వకర్మల పూర్వవైభవం, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక పరిరక్షణ మరియు నాయకత్వ అభివృద్ధి లక్ష్యంగా విశ్వకర్మ ఏక్తా యాత్ర కొనసాగుతోందన్నారు.గుర్తింపు నుంచి గౌరవం వరకు – నైపుణ్యం నుంచి ఆదాయం వరకు – వృత్తి నుంచి పారిశ్రామిక శక్తి వరకు” అనే దృక్పథంతో *25 జాతీయ డిమాండ్లను “విశ్వకర్మ జాతీయ అభివృద్ధి చార్టర్–2026”*గా దేశం ముందుంచుతున్నామని తెలిపారు. విశ్వకర్మ సమాజానికి సంబంధించిన సామాజిక–ఆర్థిక–వృత్తి డేటా సేకరణ, జాతీయ విశ్వకర్మ సంక్షేమ & అభివృద్ధి కమిషన్, ప్రత్యేక కేంద్ర వ్యవస్థ, నైపుణ్య–సాంప్రదాయ సాంకేతిక విశ్వవిద్యాలయం వంటి అంశాలతో పాటు సాంప్రదాయ వృత్తులను ఆధునిక పరిశ్రమలతో అనుసంధానించేందుకు Industrial Corridors, Industrial Clusters, Common Facility Centres ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.కమ్మరం, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్, మెషినింగ్, కార్పెంటరీ, కంచర, శిల్పకళ, స్వర్ణకార తదితర వృత్తులకు ఆధునిక యంత్రాలు, నైపుణ్య శిక్షణ, ముడి పదార్థాలు, మార్కెట్, ఎగుమతి అవకాశాలు కల్పించడంతో పాటు రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు, సామాజిక భద్రత, ఆరోగ్య–ప్రమాద బీమా, వృద్ధాప్య పింఛన్ వంటి అంశాలను కూడా చార్టర్‌లో చేర్చామని వివరించారు.విశ్వకర్మల శిల్పశాస్త్రం, వాస్తు, దేవాలయ నిర్మాణం, శిల్పకళ, పురాతన పరికరాలు, మాన్యుస్క్రిప్టులు మరియు మౌఖిక సంప్రదాయాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించేందుకు పరిశోధన, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.Skill + Tools + Capital + Market + Social Security” అనే ఐదు ఆధారాలతో అర్హత కలిగిన ప్రతి విశ్వకర్మ కుటుంబానికి గౌరవప్రదమైన, స్థిరమైన జీవనోపాధికి అవకాశాలు కల్పించడమే 25 డిమాండ్ల ప్రధాన లక్ష్యమని పుష్పగిరి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ బోరబండ నుంచి ప్రారంభమైన యాత్ర నవంబర్ 29న ఢిల్లీలో ముగింపు సభతో పూర్తవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సోదరులు, యువత, మహిళలు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, కళాకారులు మరియు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ యాత్రలో వడ్ల సిద్ధ రాములు సిరికొండ సుదర్శన్ చారి తిప్పర్తి రాజు వెగ్గిలం గోపాల్ చారి శ్రీనివాస్ చారి ప్రభాకర్ చారి బ్రహ్మచారి తదితరులు పాల్గొంటున్నారు.