పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26
హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్, ఖేలో ఇండియా యూత్ అండర్-18 అథ్లెటిక్స్ సెలక్షన్ ట్రయల్స్ కమ్ ఛాంపియన్‌షిప్స్ క్రీడలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిభావంతులైన యువ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత రెడ్డి గార్లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు అభినందించారు.యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మంచి పేరు తీసుకురాగలరని అన్నారు.ఖేలో ఇండియా యూత్ అండర్-18 ఎంపిక ట్రయల్స్ ద్వారా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి ఉన్నత స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్,జిల్లా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చైర్మెన్, హసన్పర్తి పాక్స్ చైర్మన్ పింగళి వెంకటరెడ్డి, 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, జిల్లా సీనియర్ నాయకులు శివరాం, జిల్లా అథ్లెటిక్స్ సభ్యులు, నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.