Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 2:01 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-సూపర్ స్పెషాలిటీ పనులను పరిశీలించి వేగంగా పూర్తి గా చేయాలి :: ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియాన ఆదేశాలు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 :::  వరంగల్

వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్తూ, ఐఏఎస్, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ వాణి సోమవారం వరంగల్‌లోని నూతనంగా నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ముఖ్య కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.అనంతరం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా సంబధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్శనలో సంబంధిత శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు.