వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం* *బల్దియా కమిషనర్ వెంకన్న* ▪️ జిడబ్ల్యూ ఎంసీ పరిధిలో సుమారుగా 19 ప్రధాన చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు ▪️ ప్రధాన చెరువులతో పాటు చిన్న చెరువుల వద్దనూ ప్రత్యేక సౌకర్యాలు ▪️ 30 క్రేన్లు, 145 మంది గజ ఈతగాళ్లు, 500 మంది సిబ్బంది అందుబాటులో ▪️ రోడ్ల మరమ్మతులు, బుష్ కటింగ్, పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు పూర్తి ▪️ పోలీసులు, వివిధ శాఖలు, గణేష్ ఉత్సవ కమిటీల సమన్వయంతో పటిష్ఠ చర్యలు

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  GWMC, సెప్టెంబర్ 22: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బల్దియా కమిషనర్ టి. వెంకన్న నేడు ఒక ప్రకటనలో తెలిపారు.నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, భద్రత, రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జి డబ్ల్యూ ఎం సి పరిధిలో...