వాగులో వృధాగా వెళ్తున్న వర్షపు నీటిని సాగునీరుగా మార్చేందుకు రిజర్వాయర్ లోకి మల్లింపు…వరద నీటిని నవాబ్‌పేట రిజర్వాయర్‌కు తరలించే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 స్టేషన్ ఘనపూర్ ఎల్ నీనో ప్రభావంతో దేశంలో, రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్న వేళ.. వర్షపు నీటిలోని ప్రతి ఒక్క చుక్కనూ ఒడిసిపట్టి రైతులకు సాగునీరుగా అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామం వద్ద వాగులో వరద నీరు వృథాగా పోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే స్పందించి...