వరంగల్‌లో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ శాంతి దినోత్సవం “మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపండి” అంటూ శాంతి సందేశం
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 21 ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదీయ్యా ముస్లిం కమ్యూనిటీ వరంగల్ నగరం ఆధ్వర్యంలో శాంతి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.నాయుడు పెట్రోల్ పంప్ ప్రాంతంలోని ఆర్టీఏ సర్కిల్ వద్ద కమ్యూనిటీ సభ్యులు గంటపాటు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ప్రపంచ శాంతి, మానవ సమాజంలో ఐక్యత, సామరస్యత, సోదరభావం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఘర్షణలు, హింస, ఆయుధ పోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో శాంతి, న్యాయం, పరస్పర గౌరవం, మానవతా విలువల...