వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 హనుమకొండ: క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి, గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేం దర్ రెడ్డి అన్నారు.వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ – జూనియర్ బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాలతో పాటు ఇండియా యూత్ అండర్-18 సెలెక్షన్ ట్రయల్ క్యాంప్ కార్యక్రమానికి వరంగల్...