మర్కోడు లో కలకలం.. జల్లేరు వాగు ఒడ్డున అనుమానాస్పద మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 12: ఆళ్లపల్లి మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మార్కోడు గ్రామపంచాయతీ పరిధిలోని సుద్ధరేవు గ్రామంలో గత నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న పూనేం రామ్ నారాయణ (50) శనివారం మర్కోడు జల్లేరు వాగు ఒడ్డున మృతదేహంగా కనిపించాడు. రామ్ నారాయణ వలస గొత్తికోయ తెగకు చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. దయ్యం పట్టిందని భావించిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంత్రాలు, పూజలు చేస్తూ నయం చేస్తాడని గ్రామస్తులు పేర్కొన్నారు. మృతుడి ఛాతీపై కత్తితో...